మెగా స్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సైరా నర్సింహారెడ్డి లాంటి సినిమా తరువాత చిరు నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు ఈ సినిమాలో రాంచరణ్ కూడా నటిస్తున్నారని సమాచారం. అయితే రాంచరణ్ సరసన హీరోయిన్ గా సమంతని ఎంచుకున్నట్టు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న సమంత ఇటీవల జాను సినిమాతో మరో హిట్ తన కథలో వేసుకుంది. మరి సమంత నిజంగా ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనేది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ నెట్టింట్లో ఈ వార్త పై సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గతంలో శివ దర్శకతవంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా లో నటించిన సంగతి తెలిసిందే.