యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్ యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై8న విడుదల కానుంది. తాజాగా ఈ పిక్చర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ లవ్ స్టోరిగా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉంది.
హీరోయిన్స్‌గా రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ నటించారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే క్లాస్, మాస్ గెటప్‌లో నాగచైతన్య కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. విక్రమ్ కుమార్ మార్క్ డైలాగ్స్ కనిపిస్తున్నాయి. ఇక థమన్ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్లో ఉంది.
ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ‘మనం’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత విక్రమ్- చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘థాంక్ యూ’ కాగా, ఈ ఫిల్మ్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఓ వైపు నాగచైతన్య సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన క్రమంలో మరో వైపున నాగచైతన్య మాజీ భార్య సమంత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి డిలీట్ చేయడం చర్చనీయాంశమవుతోంది.
నాగచైతన్య ‘థాంక్ యూ’ టీజర్ చూసి సమంత రియాక్షన్ ఇచ్చిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, ‘థోర్: లవ్ అండ్ థండర్’ మూవీ ట్రైలర్ చూసిన సమంత..తన ఇన్ స్టా స్టోరిస్‌లో ‘డెడ్’ అని రాసి ఫైర్ ఎమోజీ పెట్టింది. కొద్ది సేపటి తర్వాత డిలీట్ చేసింది. అనంతరం ఈ ఫిల్మ్‌లో నటించిన క్రిస్టియన్ బాలే లుక్‌ను షేర్ చేస్తూ ‘ది గాడ్ ఆఫ్ యాక్టింగ్’ అని క్యాప్షన్ ఇచ్చింది.