- విడాకులకు కారణాలు చెప్పిన సమంత..!
తెలుగులో నాగచైతన్య సరసన నటించి ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తన మాయలో పడేసిన సమంత.. చైతన్యను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. బిగ్ స్క్రీన్ పై సామ్ రీ ఎంట్రీ తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. తాజాగా సౌత్ ఇండియా స్టార్లు నటించిన హిందీ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ త్వరలో ప్రసారం కాబోతోంది.
కాఫీ విత్ కరణ్ సీజన్- 7 త్వరలో ప్రసారం కానుండటంతో.. ఈ సీజన్ కు పలువురు సీనియర్ స్టార్ యాక్టర్స్ సైతం హాజరుకానున్నారు. తొలి ఎపిసోడ్ సమంతతో ప్రారంభించగా.. ఇటీవలే ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
కాగా…. నాగ చైతన్యతతో డైరోర్స్ అనంతరం ఎక్కడా ఆ టాపిక్ గురించి ఓపెన్ కాని సమంత.. ఈ షో ద్వారా పలు కొత్త విషయాలను బయటపెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2 తో బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించిన నటి.. ఈ టాక్ షో ద్వారా హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఈ షోలో సాయిపల్లవి, రానా, విజయ్ దేవరకొండ, నిత్యా మీనన్, తదితరులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.