హీరోయిన్ సమంత మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. తన విడాకుల విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది. అంతే కాకుండా పుష్పమూవీలో ఐటెమ్ సాంగ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. ‘మ్యారేజ్ లైఫ్ లో తాను 100 శాతం నిజాయితీగానే ఉన్నానని.. కానీ అది వర్కౌట్ కాలేదు. అలాంటప్పుడు నేనెందుకు ఇంట్లోనే ఏదో నేరం చేసినట్టు కూర్చోవాలి అని ప్రశ్నించింది సామ్.
తాను డివోర్స్ తీసుకున్న కొంతకాలానికే ‘పుష్ప’ మూవీలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. నేనేమీ తప్పు చేయలేనప్పుడు ఎందుకు ఇంట్లోనే బాధపడుతూ కూర్చోవాలి.. అందుకే వెంటనే ఆ సాంగ్ కి ఓకే చెప్పాను అని తెలిపింది. ఆ పాటను అనౌన్స్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు ఫోన్లు చేసి.. ప్రస్తుతం నువ్వు ఇంట్లో కూర్చో చాలు.. విడిపోయిన వెంటనే ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు అంటూ సలహాలు ఇచ్చారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు.. అంటూ వెల్లడించింది సమంత.
ఇప్పటికే నేను ఎన్నో బాధలు పడ్డాను.. ఓ హీరోయిన్ గా ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్ గా, మరింత అందంగా ఉండాలని కష్టపడుతూనే ఉన్నాను. మయోసైటిస్, మెడికేషన్ కారణంగా నాపై నాకే కంట్రోల్ లేకుండా పోయిందని చెప్పింది. నేను స్టైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే అది నిజం కాదు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురిని నా కళ్లు తట్టుకోలేవని తెలిపింది సామ్.
ఇలాంటి పరిస్థితి ఏ నటికి కూడా రాకూడదు. అన్నింటినీ దాటుకొని ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఎవరైనా సరే నా లుక్స్ గురించి కామెంట్స్ చేసినా.. నేను పెద్దగా పట్టించుకోను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత. ప్రస్తుతం సామ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. మరోసారి సమంత కామెంట్స్ పై నెట్టింట చర్చ కొనసాగుతుంది.