జాను సినిమా తర్వాత గ్యాప్ తీసుకుంటున్న సమంత… ఫైనల్ గా శాకుంతలంను పట్టాలెక్కించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న సామ్… గుణశేఖర్ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ మూవీ చేయనుంది. పాన్ ఇండియన్ సినిమాగా గుణ టీం వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈసినిమాని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లో శాకుంతలం సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించారు. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవడంతో తాజాగా ఈ సినిమా ప్రారంభోత్వవం పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. త్వరలో శాకుంతలం సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలబోతోంది. ఇక ఈసినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమాకి భాగ స్వామ్యం అవుతోంది. దిల్ రాజు ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో భాగమవడంతో సినిమా మీద భారీ అంచనాలు మొదలయ్యాయి.
#MythologyForMillennials Pan-India film, Epic Love Story #Shaakuntalam launched today 🤍@Samanthaprabhu2 @ActorDevMohan @Gunasekhar1 @neelima_guna #Manisharma @GunaaTeamworks @SVC_official @DilRajuProdctns
The regular shoot of this film will kick starts next week. pic.twitter.com/xcHPc93h89
— Gunaa Teamworks (@GunaaTeamworks) March 15, 2021