సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇంస్టాగ్రామ్ అయితే ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. కాగా సమంత తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అది మరేదో కాదు.. సమంత కొత్త కుక్క ను పరిచయం చేసింది. దానికి సాషా అనే పేరు కూడా పెట్టింది. ఆ ఫోటోలో మరో కుక్క హ్యాష్ కూడా కనిపిస్తోంది.
ఈ రెండు కుక్కలను సమంత పెంచుకుంటుంది. అయితే కొత్త కుక్క బాగా ఇబ్బంది పెడుతోందని… ఉదయం నుండి 19 సార్లు మూత్రాన్ని శుభ్రం చేశానని ప్రశాంతంగా కప్పు కాఫీ కూడా తాగడం లేదని చెప్పుకొచ్చింది. ఈ ఫోటోలతో పాటు HashandSaasha #brotherandsister #its goingtobeaparty అనే హ్యాష్ ట్యాగ్‌లను జోడించింది.