కొన్ని రోజులుగా సమంతా, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని, కౌన్సిలింగ్ కు అటెండ్ అవుతున్నారని ఇలా ఎన్నో రకాల ప్రచారాలు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.
అయితే, కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. సమంతా త్వరలో ముంబైకి మకాం మార్చబోతున్నారని ఆ టాక్ సారాంశం. ఓవైపు చైతూతో రిలేషన్ సరిగా లేకపోవటంతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో వచ్చిన గుర్తింపుతో అక్కడ ఆఫర్స్ వస్తుండటంతోనే ముంబైకి మకాం మార్చబోతున్నట్లు ప్రచారం సాగుతుంది.
ముంబైలో ఇప్పటికే ఓ ఫ్లాట్ కొనుగోలు చేయటంతో పాటు ఓ మేనెజర్ ను, పీఆర్ ను కూడా నియమించుకున్నారని టాక్ వినిపిస్తోంది. మరీ ఈ ప్రచారంలోనూ ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.