తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం బీస్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తొలి సింగిల్ అరబిక్ కుతు ను ప్రేమికుల రోజున రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడచూసినా ఈ సాంగ్ ఇప్పుడు వినిపిస్తుంది.
విజయ్, పూజా హెగ్డేల డ్యాన్స్ మూమెంట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తో నిండిపోయాయి. అయితే ఇప్పుడు ఆ మూమెంట్స్ ను రీల్స్ చేసి అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది సమంత.
పూజా హెగ్డే మాల్దీవులలో విహారయాత్రలో ఉన్నప్పుడు అరబిక్ కుతు పాటకు డాన్స్ చేసింది. అంతే కాకుండా మీరు కూడా చేయండి అంటూ పిలుపునిచ్చింది. దీనితో సమంత కాస్త డిఫరెంట్ గా స్టెప్స్ వేసింది . ఇంకో లేట్ నైట్ ఫ్లైట్…అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది.
సమంత పోస్ట్ చేసిన కాసేపటికే నటి సన్యా మల్హోత్రా, లక్ష్మి మంచు, శిల్పా రెడ్డి, అనిరుధ్ ఆయుష్మాన్ ఖురానా, పూజా హెగ్డే వంటి స్టార్స్ లైక్స్ కొట్టారు.