స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు, ఫోటో షూట్లు చేస్తూ.. ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంది. ఇక ఇటీవల సామ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది.
తాజాగా ఓ మ్యాగజైన్ కోసం కళ్ళు చెదిరేలా అందాలు ఆరబోసింది సామ్. గ్లామర్ హీట్ పెంచి నెమలి మాదిరిగా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఫోటోలే హాట్‌గా ఉన్నాయనుకుంటే.. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పెంచేశాయి.
‘నా స్కిన్ టోన్‌తో కంఫర్ట్‌గా ఉండేందుకు.. నాకు కొంత సమయం పట్టింది. చాలా సినిమాలు చేసిన తర్వాత నాపై నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు నేను ఏ రోల్ అయినా చేయగలను. సెక్సీ సాంగ్ అయినా, హార్డ్ కోర్ యాక్షనైనా, చేయగలను అనే నమ్మకం వచ్చింది. ఇంతకు ముందు నాలో ఆ ధైర్యం లేదు. కానీ, చాలా సినిమాలు చేయడం వల్ల ఆ ధైర్యం వచ్చింది.’ అంటూ సామ్ పేర్కొంది.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. హరి, హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన ‘యశోద’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. అలాగే, గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో కలిసి కూడా సామ్ ఓ సినిమాలో కనిపించనుంది.
Advertisements