సమంత గతేడాది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటుంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత.
ఫ్యామిలీమ్యాన్ రూపకర్తలు తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చింది. దీనితో పాటు ఖుషీ షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. ఇక ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఇదిలా ఉంటే సమంత మరోసారి తన ఆరోగ్యంపై స్పందించింది. ఇప్పుడు తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుందని తెలిపింది.
యశోద సినిమా టైమ్‌లో బలహీనంగా ఉన్నా.. దాంతో అప్పుడు బయటకు వచ్చేందుకు తన ఆరోగ్యం ఏ మాత్రం సహకరించలేదని కన్నీళ్లతో వెల్లడించింది. అంతేకాకుండా యశోద సినిమా తన భుజాలపై ఉండటంతో ప్రమోషన్‌ల కోసం పలు ఇంటర్వూలు చేసినట్లు చెప్పింది. ఇక శాకుంతలం విడుదలయ్యే సమయానికి తన ఆరోగ్యం కుదుటపడటం చాలా సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది.
మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో సమంత శకుంతలగా నటించింది. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.