వరుస ఫ్లాపులతో ఉన్న హీరో సూర్య ఇటీవల సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశమే నీ హద్దురా చిత్రంతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో స్పదింస్తూ సూర్య కు విషెస్ చెప్తున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఫిలిమ్ ఆఫ్ ది ఇయర్. ఈ సినిమా ఓ ఆణిముత్యం. డైరెక్షన్ సుధా కొంగర డైరెక్షన్ అమేజింగ్. సూర్య, అపర్ణ యాక్టింగ్ అద్భుతం. అవసరమైన ప్రేరణ స్ఫూర్తి ఈ సినిమాలో ఉన్నాయి.. అంటూ సమంత ట్విట్టర్లో పేర్కొంది.