టాలీవుడ్ స్టార్ కథానాయిక సమంత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా కాలం గడుపుతోంది.ఆమె కొద్ది రోజుల క్రితం నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకుంది.
ఈ భామ తాజాగా ‘సిటాడెల్ ఇండియా’ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఇందులోని పాత్ర కోసం సమంత ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. హిందీ భాషలోని యాస కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటోంది.తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్ 1990ల నేపథ్యంలో సాగుతోందని తెలుస్తోంది.
ఈ సిరీస్ చిత్రీకరణ కోసం చిత్రబృందం ప్రత్యేక నవంబరు తొలివారంలో వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. నవంబరు చివర్లో కానీ డిసెంబరు తొలివారంలో కానీ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందనుంది.
సిటాడెల్ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మేడెన్ నటిస్తున్నారు. వరుణ్‌ధావన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘సిటాడెల్ ఇండియా’కు రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు.