విడాకుల తర్వాత తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టింది సమంత. కెరీర్ పరంగా వినూత్నమైన స్టెప్స్ వేస్తూ వస్తోంది. అయితే.. మాయోసైటిస్ అనే వ్యాధి సోకడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే.. అంతలోనే కోలుకుని షూటింగ్స్ లో పాల్గొంటోంది.
తాజాగా తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రమణ్యస్వామి ఆలయంలో మెరిసింది సమంత. అక్కడ ప్రత్యేక పూజలు జరిపింది. కొండ కింది నుంచి పై దాకా మెట్టు మెట్టుకు హారతి వెలిగించింది.
ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత మొక్కు తీర్చుకునేందుకు ఈ ఆలయాన్ని సమంత దర్శించుకుందని అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా బయటకొచ్చిన ఈ ఫొటోల్లో సింపుల్ సల్వార్ కమీజ్ డ్రెస్ ధరించి, మాస్క్ తో కనిపించింది సామ్.
ఇక సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషీతో పాటు, హిందీలో ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది.