టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దగ్గుబాటి రానాతో హిరణ్యకశ్యప అనే సినిమా చేయాలని భావించాడు. కానీ ఈ బిగ్ బడ్జెట్ మూవీ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతుండటంతో, గుణశేఖర్ శకుంతలం అనే సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, సమంతాను కలిసి వివరించగా… సమంతా కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
జనవరి మొదటి వారంలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుండగా… గుణశేఖర్ హోం బ్యానర్ గుణ టీం వర్క్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూట్ ప్రారంభంకానుండగా, దీపావళి లేదా క్రిస్మస్ కు రీలీజ్ కానుంది. సమంతా త్వరలో నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.