మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. అనంతరం పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చి.. ఆమెను తన సోదరుడికిచ్చి వివాహం జరిపించాడు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ సంభాల్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సంభాల్ అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైద్ నగలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి నాలుగేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. దంపతుల మధ్య గొడవలు తలెత్తడం వల్ల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న భార్త.. దబోయి ఖుర్ధ్ గ్రామానికి చెందిన ఓ యువతితో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పెళ్లి మండపానికి వచ్చి వాగ్వాదానికి దిగింది. తాను బతికి ఉండగానే.. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం ఎలా చేసుకుంటాడని నిలదీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంచాయితీ పెట్టగా.. రెండో భార్యకు విడాకులు ఇచ్చి.. తన సోదరుడికే ఇచ్చి పెళ్లి జరిపించాడు. దీంతో గొడవ సద్దుమణిగింది.