టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోయిన్ సమీరా రెడ్డి. తక్కువ సినిమాలే చేసినా అన్నీ స్టార్ హీరోల సినిమాల్లోనే కనపడింది ఈ అమ్మడు. అయితే ఆ సినిమాలు అన్నీ ఫ్లాప్ కావడంతో ఈమె కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడింది. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు ఆ తర్వాత క్రికెటర్లతో ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్.
స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం ఉన్నా సరే ఆమె సినిమాలకు ఎందుకో దూరం జరిగింది. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. తాజాగా తన కెరీర్ కి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు డెస్క్ జాబ్ చేసే తాను… 1998లో మొట్టమొదటిసారి ఆడిషన్స్ కోసం వచ్చారట. మొదటిసారి మహేష్ బాబు హీరోగా నటిస్తున్న రాజకుమారుడు సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళింది.
ఆ ఆడిషన్ కోసం వెళ్ళినప్పుడు తాను చాలా భయం భయంగా ఉన్నాను అని ఈ ఆడిషన్లో భాగంగా అక్కడ వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఈమె పూర్తి చేయలేక ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. తనకు సినిమాలు సెట్ కావనీ తాను ముందు ఏ జాబ్ అయితే చేస్తున్నానో అదే చేయాలని అనుకున్నా… కొన్ని రోజులకు మరింత ధైర్యంతో ముందుకు వచ్చి ప్రైవేట్ ఆల్బమ్ కోసం కెమెరా ముందుకు వచ్చారట. అలా సినిమాల్లోకి స్లోగా ఎంట్రీ ఇచ్చారు.