సైలెంట్ గా సినిమాలు చేస్తూ, మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా, కరోనా టైమ్ లో కూడా థియేటర్లలో సక్సెస్ అవ్వడంతో.. ఇండస్ట్రీ మొత్తం కిరణ్ వైపు చూసింది. ఇప్పుడీ హీరో నుంచి మరో సినిమా రెడీ అవుతోంది. దాని పేరు సమ్మతమే. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
పెళ్లికి ముందు ప్రేమ అంటే నమ్మకం లేని వ్యక్తిగా హీరోను ప్రజెంట్ చేశారు. చాందినిని కలుసుకుని, ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని తెలుసుకునే వరకు, అతను తన లవ్ ఫీలింగ్ ను నమ్మడు. మరోవైపు, చాందిని చాలా జోవియల్ పర్సన్, ఆమె జీవితాన్ని తనదైన రీతిలో గడిపేస్తుంది.
వీళ్లిద్దరి ప్రేమకథ ఏ మలుపు తిరిగింది, ఎలా తీరాన్ని చేరిందనేది సమ్మతమే సినిమా కథ. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరిల లవ్ ట్రాక్ టీజర్ కు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. అమ్మాయిలతో కిరణ్ వచ్చీరాని హిందీ మాట్లాడడం, పిల్లవాడి బెలూన్ పగలగొట్టే సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.
Advertisements
యుజి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిగ్గా సరిపోయింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జూన్ 24న విడుదల కానుంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.