గతంలో పూణెలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు.. తాము తయారు చేసిన 4 కిలోల నాన్ వెజ్ థాలీని గంటలోపు తింటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో అది వైరల్ కూడా అయింది. అయితే, తాజాగా ఓ రోడ్డు సైడ్ ఫుడ్ షాపు నిర్వాహకుడు కూడా ఫుడీస్ కోసం ఓ ఛాలెంజ్ విసిరాడు. తాను తయారు చేసిన 3 కిలోల సమోసాను తింటే రూ.11 వేల రూపాయలు బహుమతిగా ఇస్తా అని తెలిపాడు.
ఢిల్లీ ఘజియాబాద్‌లోని షాహిబాబాద్‌లో ఉన్న ఓ రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ నిర్వాహకుడు తమ కస్టమర్ల కోసం క్రేజీ ఆఫర్‌ను ప్రకటించాడు. తాను తయారు చేసిన 3 కేజీల సమోసాను 5 నిమిషాల్లో తిన్నవాళ్లు రూ.11 వేల నగదును ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చని తెలిపాడు.
దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్ ఫుడీ విషాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే, ఈ సమోసా ఛాలెంచ్‌లో గెలిచి రూ.11 వేలు గెలుచుకున్న వ్యక్తి వివరాలు కూడా విషాల్ వీడియోలో తెలిపారు.
గౌరవ్ ఖురానా అనే వ్యక్తి ఇటీవల ఈ సమోసా ఛాలెంజ్‌లో గెలిచి ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ భారీ సమోసాను తినడానికి 5 నిమిషాల టైమిస్తే గౌరవ్ మాత్రం 4 నిమిషాల 51 సెకన్లలో తినేశాడు. ప్రస్తుతం గౌరవ్ సమోసా తింటున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఈ సమోసా ధర అక్షరాలా రూ.500 ఉన్నట్లు తెలిపాడు.