మాస్ మహారాజా రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విక్రమార్కుడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఒక కథను సిద్ధం చేస్తున్నారట రచయిత విజయేంద్రప్రసాద్. అయితే ఈ సీక్వెల్ కు రాజమౌళి కాకుండా వేరొక దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడట.
అది మరెవరో కాదు… ఇటీవల సీటిమార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న సంపత్ నంది అని తెలుస్తోంది. ఇక రవితేజ సంపత్ నంది కాంబినేషన్ లో గతంలో బెంగాల్ టైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.