యూపీలో మంకీ పాక్స్ కలకలం సృష్టించింది. ఘజియాబాద్ కు చెందిన ఓ బాలికకు మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతోంది. తన ఒంటిపై దురద, దద్దుర్లు వస్తున్నాయని వైద్యులను చిన్నారి సంప్రదించింది.
దీంతో ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపినట్టు ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల క్రింద ఆమెకు పరీక్షలు నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు.
ఆమెకు మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారు. ఆమె కానీ, ఆమె సన్నిహితులు, బంధువులు కానీ ఈ నెలల్లో ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదని వివరించారు. కేవలం ముందస్తు చర్యల కింద ఆమె నుంచి నమూనాలను సేకరించినట్టు స్పష్టం చేశారు.
పలు దేశాల్లో మంగళవారం మంకీపాక్స్ కేసులు సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్ అయింది. ఈ మేరకు మంకీపాక్స్ వ్యాధి నిర్వహణపై మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.