విజయవాడ: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజును అతని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షల సందేశాలు సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ట్వీట్ల వర్షం ఆగకుండా కురుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్ ఫాన్స్ ఈ వేడుకను సామాజిక సేవా కార్యక్రమాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలు ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు, ఆసుపత్రులలో పళ్లు పంచడాలు, పండగ రోజు కూడా కావడంతో అన్న సంతర్పణలు వగైరా వగైరా కార్యక్రమాలతో పవర్‌స్టార్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన స్థాపించిన జనసేనకు తోచిన మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. ‘కొబ్బరి మట్ట’ టీమ్ జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది. సంపూర్ణేశ్, ఉమామహేశ్‌లతో కలిసి తాను జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా అందజేశామని ‘కొబ్బరి మట్ట’ నిర్మాత సాయి రాజేశ్ ట్వీట్ చేశారు. ఇలావుంటే, జన సేనాని పేరుతో పవన్‌కల్యాణ్ ఫాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లకు కొత్త డీపీని పెట్టుకున్నారు. రంగురంగుల్లో కనిపిస్తున్న ఈ డీపీలో పవన్‌కల్యాణ్ చిరునవ్వుతో ఒకటి, తీక్షణంగా ఆలోచిస్తూ మరోటీ పోజులతో కనిపిస్తున్నాడు. మార్పు వచ్చే వరకు ఎత్తులేస్తా.. అనే క్యాప్షన్ కూడా ఈ పోస్టర్‌పై ఉంది. కింద హ్యాపీ బర్త్ డే విషెస్ తెలుపుతూ మరో క్యాప్షన్ కనిపిస్తోంది. పవన్ ఫ్యాన్స్ ఈ డీపీని రూపొందించి బయటికి వదిలారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ ద్వారా ఈ డీపీ అందరి దృష్టిలో పడింది. చెర్రీ తన బాబాయ్ సేవాదృక్పథం గురించి వివరిస్తూ.. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి ఈ డీపీని అందరికీ షేర్ చేశాడు.