జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సంఖ్యలో విషెస్ లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరోలు,నటులు చాలా మంది పవన్ కు విషెష్ లుతెలిపారు. కాగా పవన్ కు విషెస్ చెప్తూ ట్వీట్ చేసిన వారందరికీ రిప్లై ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఆర్ఎక్స్100 హీరో కార్తికేయను సార్ అని సంబోధిస్తూ ట్వీట్ చేశాడు. అయితే కార్తికేయ ఆ ట్వీట్ కు స్పందిస్తూ మీ లక్షల మంది అభిమానులలో నేను ఒకరిని సార్.. మీరు నన్ను సార్ అనటమేంటి అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా పవన్ కు బుధవారం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా విషెస్ తెలిపారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు పవన్. అయితే పవన్ రిప్లై పై స్పందిస్తూ అన్న మీ దగ్గరనుంచి రిప్లై రావడం, ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అంటూ ట్వీట్ చేసాడు.
అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 https://t.co/UtVdEtukmD
— Sampoornesh Babu (@sampoornesh) September 3, 2020