రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసిపి మంత్రులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైసీపీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి పవన్ పై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖ మంత్రి అనిల్ మాట్లాడుతూ… ఆన్లైన్లో టికెట్లు అమ్మితే తప్పేంటి… మాకు సంపూర్ణేష్ బాబు అయినా.. పవన్ కళ్యాణ్ అయినా ఒకటే అని అన్నారు. ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా సంపూర్ణేష్ బాబు స్పందించారు.
మంత్రి అనిల్ గారు, మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో వున్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు అంటూ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు.