ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు అతి త్వరలో కొత్త మోడల్ అందుబాటులోకి వస్తోంది. శ్యామ్ సంగ్ మడత పెట్టే ఫోన్ అక్టోబర్ 1న భారత మార్కెట్ లో విడుదల కాబోతోంది.
ధరలు మాత్రం భారీగా ఉండే అవకాశం ఉంది. గెలాక్సీ ఫోల్డ్ ధర రూ.1.50 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉండవచ్చు.
గెలాక్సీ ఫోల్డ్ మడత పెట్టినప్పుడు 4.6 అంగుళాల డిస్ప్లే కనిపిస్తుంది. మడతతీస్తే 7.3 అంగుళాల ట్యాబ్ గా వాడుకోవచ్చు. ఈ సమయంలో ఒకేసారి మూడు యాప్ లు తెరుచుకుంటాయి.
శ్యామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు 7.3 అంగుళాల డిస్ప్లే, 12 జి.బి ర్యామ్, 512 జి.బి ఇంటర్నల్ స్టోరేజ్, 4380 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఆరు కెమెరాలు ఉంటాయి. వెనుక వైపు 16 మెగాపిక్సెల్ తో ఒక కెమెరా, 12 మెగాపిక్సల్ తో రెండు కెమెరాలు, ముందువైపు 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ తెరిస్తే లోపల రెండు కెమెరాలు ఉంటాయి. ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది.