సంయుక్త మీనన్ ..తన లుక్ తోనే కాదు, మాటతో తెలుగు కుర్రాళ్ళను పడగొట్టిన సమ్ థింగ్ స్పెషల్ స్టన్నింగ్ బ్యూటీ. ఈ మధ్య కాలంలో మళయాళం నుంచి తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మల్లో సంయుక్త ఒకరు.
అతి తక్కువ కాలంలో తెలుగు స్పష్టంగా మాట్లాడ్డం నేర్చుకుని..తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ఔరా అనిపించింది. భీమ్లానాయక్ సినిమాలో దగ్గుబాటి రానాకు భార్యగా నటించింది. తాను చేసింది తక్కువ నిడివి ఉన్న పాత్రలో కూడా తనదైన నటనతో ఆకట్టుకున్న చిన్నది.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సంయుక్తకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ధనుష్ చేస్తోన్న సర్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది మీనన్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మామూలుగానే హీరోయిన్స్ పెళ్ళికి సంబంధించిన రూమర్స్ హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే సంయుక్తకు కూడా పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీని పై సంయుక్త చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
నేను పెళ్ళిచేసుకోవాలని అనుకుంటే..అందుకు తగ్గ వ్యక్తి దొరకాలి. నన్ను ప్రేమగా చూసుకొనేవాడు దొరకాలి. నా ఎమోషన్స్ ను గౌరవించాలి. ఇలా అన్ని రకాలుగా నచ్చితే అప్పుడు పెళ్లిగురించి ఆలోచిస్తా.. ఇప్పటికైతే పెళ్లి ఆలోచన లేదు అని తేల్చి చెప్పింది.
అలాగే చాలా మంది పెళ్లి అవసరమా అని అంటున్నారు. కొందరు మహిళలు కూడా అదే విషయం చెప్పారు. పెళ్లి చేసుకునేవాడు సరైనవాడు దొరికితేనే మహిళ సేఫ్‌గా ఉంటుంది. లేదంటే పెళ్లి మీద అసహనం ఏర్పడుతుంది అని చెప్పుకొచ్చింది సంయుక్త.
అయితే అమ్మాయిలకి పెళ్ళిమీద ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో..ఎగ్జాట్ గా అలాంటి ఆలోచనలు కాకపోయినా అమ్మాయిలను చేసుకునే వారికి కూడా ఇంచుమించు ఇలాంటి ఆలోచనలే ఉంటాయనేది సుస్పష్టం.
అలాంటప్పుడు సంయుక్తని చేసుకోబోయేవారి అభిప్రాయాలను తాను ఎంతవరకూ గౌరవిస్తుందనేదీ కూడా పరిశీలించాల్సిన అంశం. ఏదైతేనేం అలాంటి అబ్బాయి కనీసం కలలోనైనా ఆమెకు దొరకాలని ఆశిద్దాం.