‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో డానియల్ శేఖర్ గా నటించిన రానా దగ్గుబాటి భార్య గా సంయుక్త మీనన్ నటించింది. కనిపించింది కాసేపే అయినా తన నటనతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది.
ఇదిలా ఉండగా సినిమా స్క్రీన్ టైం విషయంలో సంయుక్త మొదట నుంచి కూడా నిరాశతో ఉందని… ఆమె సినిమా కోసం దాదాపు 20 రోజులు పనిచేసిందని అయినప్పటికీ పెద్దగా ఆమెకు స్కోప్ రాలేదు అంటూ సోషల్ మీడియా లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే విషయం పై సంయుక్త స్పందిస్తూ ట్వీట్ చేసింది. అవును అభిమానులందరితో కలిసి సినిమాని రెండోసారి చూసేందుకు టిక్కెట్లు దొరక్క భీమ్లా నాయక్‌తో నేను నిరాశ చెందాను అంటూ పేర్కొంది.
ఇక భీమ్లా నాయక్ సినిమాకు ముందే సంయుక్త ధనుష్‌తో సార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే సంయుక్త స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోడం పక్కా.