ఈ తరం వాళ్లకు పెద్దగా పరిచయం లేదు గాని సన అనగానే చాలా మంచి పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి. ఆమె ఎక్కడా కూడా అసభ్యంగా సినిమాలు చేయలేదు అనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఆమె ఏ పాత్ర చేసినా హుందాగానే ఉండే విధంగా చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పలు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. తనకు పదో తరగతిలోనే పెళ్లి చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు.
అయితే తనకు చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో తన అత్తయ్య మామయ్యలు తనని ప్రోత్సహించి ఇండస్ట్రీలోకి పంపించారని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చేటప్పటికి తనకు పిల్లలు కూడా పుట్టారని ఆమె పేర్కొన్నారు. తన అత్తమామలు పిల్లలు పుట్టిన విషయాన్ని చెప్పొద్దు అని చెప్పిన తాను ఉన్న విషయాన్ని దర్శకనిర్మాతల వద్ద చెప్పడంతో తనకు హీరోయిన్ గా అవకాశాలు కూడా వెళ్లిపోయాయని గుర్తు చేసుకున్నారు.
పలు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన తనకు దర్శక నిర్మాతలు ఎన్నో కండిషన్లు పెట్టారని… పొట్టి దుస్తులు వేసుకొని నటించమని చెప్పారన్నారు. స్విమ్ సూట్ వేసుకుని నటించాలని కండిషన్లు పెట్టారని, కాని ఇలాంటి కండిషన్లు పెట్టడంతో తాను వాటికి నో చెప్పడం వల్ల కూడా తాను ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానని ఆమె అన్నారు. తాను ముస్లిం కాబట్టి హిందూ దేవతల పాత్రలలో నటించకూడదని తాను ఎప్పుడూ అనుకోలేదు అన్నారు.