చైనాపై ప్రకృతి పగబట్టినట్లే కనిపిస్తోంది. మొన్న వరదలతో అల్లాడిపోగా.. ఇప్పుడు ఇసుక తుపానుతో వణికిపోతోంది. గన్సు ప్రావిన్స్ లోని డున్హువాంగ్ నగరాన్ని ముంచెత్తింది ఇసుక తుపాను. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఉన్న ఇసుక తుపాను.. నగరం మీదకు దూసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఎటుచూసినా దట్టమైన దుమ్మే. గోబీ ఎడారికి దగ్గరలో ఉన్న ఈ నగరంలో తరచూ ఇసుక తుపాను వస్తుందని చెబుతున్నారు అధికారులు.
ఈ తుపాను కారణంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.