అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, వసతులు తెలుసుకోటానికి గుంటూరు వెళ్లిన మంత్రులు బొత్స, మోపిదేవిలను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే పస్తులతో రోడ్డు మీద పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు మీరు చేస్తున్న మేలు ఇదేనా అంటూ నిలదీశారు. దీనితో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భవన నిర్మాణ కార్మికులను సముదాయించి బొత్స అక్కడ నుంచి వెళ్లిపోయారు.
భూగర్భ డ్రైనేజ్ పనుల గడువు ఇంకో నెలరోజుల్లో ముగుస్తున్నా… ఇంకా 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, గుత్తేదార్లను మార్చాలనే ఆలోచన తమకు లేదన్నారు. అత్యవసరమైన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ప్రతి పని రివర్స్ టెండరింగ్ సాధ్యం కాదన్నారు మంత్రి బొత్స.