యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గల్లీరౌడీ. మంచి హైప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్నేహ రెడ్డి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను నేడు మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వల్ల ఇది రేపటికి వాయిదా పడింది.
స్టేట్ రౌడీ చిరంజీవి గారు… ఈ ట్రైలర్ ను ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ట్విట్టర్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇక ఈ నెల 17న ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాబీ సిన్హా విలన్ గా నటిస్తుండగా… వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.