గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు హీరో సందీప్ కిషన్. ఇటీవల నిన్ను వీడని నీడను నేనే సినిమాతో హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత వెంటనే మరో ఫ్లాప్ పడింది. దీంతో సందీప్ కథలను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం సందీప్ ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది రిలీజ్ కు సిద్దంగా ఉండగానే రౌడీ బేబీ మూవీ కి పచ్చజెండా ఊపేశారు సందీప్. ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభం అయింది.
Advertisements
నిర్మాత ఎంవివి సత్యనారాయణ క్లాప్ కొట్టగా, కోన వెంకట్ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు.