సీఎం కేసీఆర్ డెడ్‌లైన్‌కు భయాందోళనకు గురై, తన ఉద్యోగం ఉంటుందో పోతుందో అన్న భయంతో మరో కార్మికుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన కండక్టర్ నాగేశ్వర్ గురువారం ఉదయం కన్నుమూశాడు.
జోగిపేటలో నివాసం ఉండే నాగేశ్వర్ కేసీఆర్ విధించిన నవంబర్ 5 డెడ్‌లైన్ తర్వాత మతిస్థిమితం కోల్పోయాడు. టికెట్, టికెట్ అంటూ వింతగా ప్రవర్తించటంతో… భయాందోళనకు గురైన తన భార్య వెంటనే తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ సమ్మెలో ఉన్న ఉద్యోగులకు వైద్యం చేయం అని ఆసుపత్రి వర్గాలు చెప్పటంతో… ప్రైవేటు ఆసుపత్రిలో చూపించే స్తోమత లేక జోగిపేటకు వెళ్లిపోయారు.
సమ్మె కారణంగా రెండు నెలలుగా జీతం రాకపోవటంతో కుటుంబం గడవటం కూడా కష్టంగా మారింది. పైగా ఇంటి అద్దె కూడా భారంగా మారటంతో నాగేశ్వర్ భార్య తన ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
రోజురోజుకు ఆరోగ్యం క్షీణించటంతో… నాగేశ్వర్ గురువారం ఉదయం కన్నుమూశారు.