మంత్రి హరీశ్‌రావు కేవలం ఉత్సవ విగ్రహంగా మారారా? అధికారులు కూడా లెక్కచేయని స్థాయిలో హరీశ్‌రావు పట్ల అటెన్షన్ లేకుండా పోయిందా? దీనిపై పైనుంచి ఏమైనా ఆదేశాలు వున్నాయా? ఇవీ ప్రస్తుతం ప్రజానీకానికి వస్తున్న డౌట్స్. హరీశ్‌రావు పదిమార్లు ఫోన్ చేసినా ఒక ఆర్డీవో స్థాయి అధికారి లెక్కచేయకపోవడంపై బయట టాక్ రకరకాలుగా వుంది.
హైదరాబాద్ : మంత్రి హరీశ్‌రావు అంటే ఒకప్పుడు తెలంగాణలో హడల్. జనంలో ఎంత బాగా కలిసిపోతారో పనుల విషయంలో అంత పక్కాగా వుంటారని టాక్. ప్రజోపయోగమైన అంశాలలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా వుండేవంటారు. అలాంటి హరీశ్‌రావు ఫోన్ చేస్తే ఓ అధికారి రెస్పాండ్ కాని పరిస్థితి ప్రస్తుతం వుంది.
సంగారెడ్డి ఆర్డీవో శ్రీనుకు మంత్రి హరీష్‌రావు ఓ పని మీద ఫోన్ చేశారు. తీయలేదు. మళ్లీ చేశారు. నో రెస్పాన్స్. అలా ఓ పదిసార్లు చేశారు. తీయకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. చివరికి జాయింట్ కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆర్డీవోతో మాట్లాడించాలని చెప్పారు. ఐనప్పటికీ స్పందించలేదని సమాచారం. తనకు ఎంతకీ ఆర్డీవో నుంచి ఫోన్ రాకపోవడంతో నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ కనిపించిన ఆర్డీవోను పట్టుకుని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలొచ్చాయి. ఆర్డీవోకి హరీష్‌రావు పదిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంపై కారణం ఏమై వుంటుందని ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆరా మొదలైంది.