సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్‌లో భీమ్లా అనే ఆర్టీసీ కార్మికుడు నురగలు కక్కుకుని కిందపడిపోయాడు. సంగారెడ్డి డిపోలో భీమ్లా కండక్టర్ గా పని చేస్తున్నాడు. ఉదయం విధుల్లో చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చిన భీమ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగానే భీమ్లా నురగలు కక్కుకుని కింద పడిపోయాడు. హుటాహుటిన భీమ్లాను తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు.ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందని తోటి కార్మికులు చెబుతున్నారు.