ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టోర్నీ నుంచి భారత్ డబుల్స్ జోడీ సానియా మీర్జా, అన్నా డానిలీనా నిష్క్రమించింది. శనివారం మహిళల డబుల్స్ లో పోటీలో అలిసన్ వాన్ ఉత్వానాక్- అన్హెలినా కాలినానా జంట చేతిలో 4-6, 6-4, 2-6 తేడాతో పరాజయం పాలైంది. ఇటీవలే ప్రొఫెషనల్ టెన్నిస్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన సానియా మీర్జాకు ఇదే చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ.
అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ పోటీలో సానియా- రోహన్ బోపన్న జోడీ రెండో రౌండ్ లోకీ దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాకు చెందిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ జంట జామీ ఫోరెలిస్- ల్యూక్ సవిల్ పై ఈ జోడీ విజయం సాధించింది.
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవలే టెన్నిస్ కు రిటైర్ మెంట్ ప్రకటించింది. తన కెరీర్‌లో సానియా ఎన్నో విజయాలు సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016 డబుల్స్ విజేతగా నిలిచింది.
అంతకుముందు, అతను 2015లో యుఎస్ ఓపెన్, వింబుల్డన్ గెలుచుకుంది. సానియా 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ ఓపెన్ సానియా మీర్జా చిట్టచివరి టోర్నీ.
Sania and Anna into Round 2️⃣ @MirzaSania and Anna Danilina ➡️ Women's Doubles ➡️ Round 2️⃣ of #AO2023 🤩
Thoughts on the 🔝 performance of the Indian-Kazakh pair? 🇮🇳🇰🇿#SonySportsNetwork #SlamOfTheGreats #SaniaMirza #AnnaDanilina pic.twitter.com/VTe8bCgfNc
— Sony Sports Network (@SonySportsNetwk) January 19, 2023