భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీ తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనుంది. ఈ టోర్నమెంట్ వచ్చే నెలలో దుబాయ్‌లో జరుగనుంది. భారత్ టెన్నిస్‌లో అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలిచింది సానియా మీర్జా.
ఆరు గ్రాండ్‌స్లామ్స్‌లో భారత్‌కు పతకాలు అందించింది. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె భారత్ తరఫున టెన్నిస్ ఆడింది. సానియా మీర్జా గతేడాది యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంది. అయితే గాయం కారణంగా ఆమె టోర్నమెంట్‌లో ఆడలేకపోయింది.
ఆ తర్వాత ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంది. సానియా మీర్జా గత పదేళ్లుగా సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. దుబాయ్‌లో సానియా మీర్జాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సానియా అభిమానుల మధ్య టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది.
ఫిబ్రవరిలో దుబాయ్‌లో జరగనున్న డబ్యూటీఏ 1000 టోర్నమెంట్ తరువాత రిటైర్మెమెంట్ అవుతున్నట్లు సానియ మీర్జా తెలిపింది. తాను గాయం కారణం తప్పుకోవాలని అనుకోవట్లేదని.. తన ఇష్ట ప్రకారమే గుడ్ బై చెబుతున్నానని చెప్పింది.
ఎమోషనల్‌గా ముందుకు వెళ్లే శక్తి తన మనసుకు లేదని పేర్కొంది. తాను 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టానని.. ప్రాధాన్యతలు మారుతున్నాయంది. రిటైర్మెంట్ తర్వాత దుబాయ్‌లోని తన అకాడమీపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు భారత స్టార్ తెలిపింది.