ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించిన వేలం ఫిబ్రవరి 13న ముగిసింది. ఈ లీగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టులోకి హైదరాబాదీ టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా వచ్చి చేరింది. అదేంటి ఆమె టెన్నిస్ ప్లేయర్ కదా.. క్రికెట్ ఎలా ఆడుతుంది? అని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే సానియా ప్లేయర్ గా కాకుండా మహిళా ఐపీఎల్ జట్టుకు మెంటార్ గా ఎంపికైంది.
ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆర్సీబీ జెర్సీలో ఉన్ ఫొటోతో పాటు ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెంగళూరు జట్టుకు మెంటార్ గా ఎంపికవ్వడం ఆనందంగా ఉందని ఈ పోస్టులో చెప్పుకొచ్చింది సానియా మిర్జా.
ఇదిలా ఉంటే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ కు అధికారిక ముహూర్తం ఖరారైంది. మార్చి 4 నుంచి ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం 23 రోజుల పాటు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్.. గుజరాత్, ముంబై జట్ల మధ్య జరగనుంది. మార్చి 26న ఫైనల్ పోరు ఉండనుంది.
అన్ని మ్యాచులు సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభమవుతాయి. ఈ మెగా క్రికెట్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్స్ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
View this post on Instagram