కన్నడనాట ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోయిన్ సంజన, రాగిణి ద్వివేది లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సంజన బ్లడ్ శాంపిల్స్ తీసుకునేందుకు ప్రయత్నించగా ఆస్పత్రిలో హల్ చల్ చేసింది.
తాను రక్త పరీక్షలు చేయించుకొనని ఒక వేళ చేసుకున్నా టెస్టు రిపోర్ట్ తనదేననే గ్యారెంటీ ఏమిటని ఆమె మండిపడ్డారు. డ్రగ్స్ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని… జనాల ముందు తనను పిచ్చిదాన్ని చేస్తున్నారని కేకలు పెట్టింది. అయితే మరోవైపు విచారణలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.