శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మనీలాండరింగ్ కేసులో తాను మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ ఎదుట హాజరు కానున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఈడీ పంపిన సమన్లను తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాను ఈడీ ఎదుట హాజరవుతానని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు సహకరించడం తన బాధ్యతగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అందువ్ల శివసేన కార్యకర్తలు, అభిమానులెవ్వరూ ఈడీ కార్యాలయానికి చేరుకోవద్దని ఆయన సూచించారు. ట్వీట్ తో పాటు బాల్ థాక్రే ఫోటోను ఆయన అప్ లోడ్ చేశారు.
ఈడీ విచారణకు రౌత్ మంగళవారం హాజరు కావాల్సి వుండగా మరో రెండు వారాల పాటు తనకు సమయం కావాలని ఈడీని కోరారు. ఈ మేరకు తన న్యాయవాదులతో లేఖ పంపారు.