శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు మరోసారి షాక్ తగిలింది. పత్రాచల్ భూ కుంభకోణం కేసులో ఆయనకు జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 17 వరకు కోర్టు పొడిగించింది. ఈ మేరకు సోమవారం ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అంతకు ముందు రౌత్ జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 4తో ముగియాల్సి వుండగా దాన్ని ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఆయన్ని న్యాయస్థానం ఎదుట అధికారులు హాజరు పరిచారు.
పత్రా చల్ రీ డెలవలప్ మెంట్ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ సంజయ్ రౌత్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అగస్టు 1న ఆయన్ని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
అనంతరం ఆయన్ని న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా ఆయన్ని ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. ఆ తర్వాత ఆయన్ని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది. ఆ తర్వాత కస్టడీని ప్రత్యేక న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది.