ఈ మధ్య కాలంలో సినిమా ప్రముఖులు పలువురు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కొందరు అయితే క్యాన్సర్ పై పోరాటం చేసి గెలిచిన వారు మరికొందరు. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎందరో క్యాన్సర్ తో ఇబ్బంది పడి బయట పడ్డారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒకరు అనే చెప్పాలి.
Also Read:ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు….!
జీవితంలో ఎన్నో కష్టాలు పడిన సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడినా కోలుకుని నిలబడ్డారు. కీమో థెరపి వైద్యం తీసుకుని ఆయన బయట పడ్డారు. దీనిపై సంజయ్ దత్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేసారు. నాకు తరచూ వెన్ను నొప్పి వస్తూ ఉండేది అని… వేడి నీటి సీసా, నొప్పి నివారణ ఔషధాలతో చికిత్స చేసారు కాని ఒక రోజు ఊపిరి ఆడలేదు అని తెలిపారు. ఆ సమయంలో నన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారని గుర్తు చేసుకున్నారు.
అప్పుడు నా వెంట నా భార్య లేదని నా సిస్టర్స్ కూడా అక్కడ ఎవరూ లేరన్నారు. ఇటువంటి సమయంలో ఉన్నట్లుండి ఒక యువకుడు వచ్చి మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడని ఆ రోజు జరిగింది వెల్లడించారు. ఆ సమయంలో నేను కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే చనిపోవడం నయం అని అనుకున్నాను అని వివరించారు. తన తల్లి తన భార్య క్యాన్సర్ మహమ్మారితోనే మరణించినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
Also Read:పోలీసుల ఎదుట హాజరైన ఉర్ఫి జావెద్…!