ఆ క్రికెటర్ గట్టిగా అనుకున్నాడు.అనుకున్నట్టే అయిపోయింది.ఇంతకీ ఏ క్రికెటర్ అనుకున్నాడు, ఏమనుకున్నాడు.ఏం లేదండి…టీమ్ ఇండియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తాను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తలైవా రజనీకాంత్ను ఎప్పటికైనా ఆయన నివాసంలోనే కలుసుకుంటాననితల్లిదండ్రులకు మాట ఇచ్చాడు. అనుకున్న దానిని సుదీర్ఘ కాలం తర్వాత అంటే 21 సంవత్సరాల తర్వాత 28 ఏళ్ల వయసులో తీర్చుకున్నాడు.ఇది తెలుసుకున్న రజనీకాంత్ సంజూ శాంసన్ను తన స్వగృహానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారట.
దీంతో తలైవా పిలుపును అందుకున్న సంజూ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎందుకంటే తన 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుందన్న సంతోషంలో ఇటీవల చెన్నైలోని సూపర్స్టార్ నివాసానికి చేరుకున్నాడు. అక్కడ కొద్దిసేపు శాంసన్తో మాట్లాడిన రజనీ.. అతడిని శాలువతో సత్కరించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను సంజూ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అభిమానులతో అనందాన్ని పంచుకున్నాడు. కేరళలో పుట్టిన సంజూ శాంసన్కు చిన్నతనం నుంచే రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టం.
ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు స్వయంగా సంజూయే మీడియాతో తెలిపాడు. ఇకపోతే కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా సంజూ ఎక్కువగా ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడంతో పాటు తాను ఎంతగానో అభిమానించే రజినీకాంత్ సినిమా లు, మలయాళ సినిమాలు చూసేవాడినని అతడే తెలిపాడు.
ఇకపోతే సంజూ శాంసన్ ఇటీవలీ కాలంలో భారత జట్టులోకి తరుచూ వస్తూ వెళ్తూ ఉన్నాడు. అనేక కారణాలతో సంజూకు టీమ్లో సుస్థిరమైన స్థానం ఇవ్వడం లేదు సెలక్టర్లు. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఐపీఎల్లో మాత్రం గొప్పు ఆటతీరును కనబరుస్తున్నాడు సంజూ.
ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా రాజస్థాన్ టీమ్కి సారథిగా వ్యవహరించనున్నాడు శాంసన్.ఇతడి సారథ్యంలోనే గతేడాది ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టు రన్నరప్ స్థానంలో నిలిచింది.
ఇక అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు.. ఏప్రిల్ 2న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగబోయే తన మొదటి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది.