ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. నగరవాసులంతా పల్లెలకు పయనమవుతున్నారు. హైదరాబాద్ ను ఖాళీ చేసి సొంతూర్లకు వెళ్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం కుటుంబ సభ్యులతో కలిసి పల్లెబాట పడుతున్నారు.
దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో బస్సుల్లోనే ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు.
సంక్రాంతి పండగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక లైన్లను కూడా ఏర్పాటు చేశారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సందడిగా కనిపిస్తున్నాయి.