సామాన్యంగా సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు అంతటి క్రేజ్ ఎవరికైనా వస్తుంది అంటే అది చైల్డ్ ఆర్టిస్ట్ లు అని చెప్పవచ్చు. చిన్న వయసులో తెరపై నటించడం అంటే మామూలు విషయం కాదు. అందులోకి చూడాటీనికి ముద్దుగా బొద్దుగా తమ మాటలతో ఆకట్టుకోగలిగితే ఆ క్రేజ్ దానికి రెట్టింపు అవుతోంది.
ఒకప్పుడు టాలీవుడ్ నటించిన చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ప్రస్తుతం సినిమాల్లో హీరోలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కాగా మరి కొందరు మాత్రం సినిమాలపై ఆసక్తి లేకనో ఇతర కారణాల వల్లనో ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
ఒకప్పుడు నాగార్జున హీరోగా నటించిన సంతోషం సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. 2002లో వచ్చిన ఈ సినిమాకు దశరద్ దర్శకత్వం వహించగా సినిమాలో నాగార్జునకు జోడీగా గ్రేసీ సింగ్ , శ్రేయ హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో నటించిన బుడ్డోడు కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ బుడ్డోడి పేరు అక్షయ్ బచ్చు…సినిమాలో నాగార్జున కొడుకుగా…. కల్లజోడు పెట్టుకుని బొద్దుగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అక్షయ్ బచ్చు సంతోషం సినిమా కంటే ముందు బాలీవుడ్ లో అనేక చిత్రాలలో నటించాడు. బాలీవుడ్ లో అక్షయ్ నటన చూసే నాగార్జున సంతోషం సినిమాలో ఆఫర్ ఇచ్చాడు.
సంతోషం సినిమా తరవాత క్రేజ్ రావడంతో వర్షం సినిమాలోనూ ఛాన్స్ కొట్టేశాడు. ఇక కొన్ని సినిమాల తరవాత మళ్లీ చదువు వైపు దృష్టి పెట్టాడు. ఇక ప్రస్తుతం బుడ్డోడు పెద్దోడు అయ్యాడు. బాలీవుడ్ సినిమాలు మరియు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పన్నెండు సినిమాలు చేయడంతో పాటూ టీవీ యాడ్స్ లోనూ నటించాడు. మరి సంతోషం తో వచ్చిన క్రేజ్ తో తెలుగులో రీఎంట్రీ ఇస్తాడా లేదో చూడాలి.