క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ మోడలింగ్ ను తన కెరీర్ గా ఎంచుకుంది. పాపులర్ క్లాతింగ్ కంపెనీ యాడ్ లో సారా నటించింది. మరో ఇద్దరితో కలిసి నటించిన ఈ యాడ్ ను సారా తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన అభిమానులు విష్ చేస్తున్నారు.
క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండుల్కర్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టెండుల్కర్ తన కొడుకు అర్జున్ ను కూడా క్రీడా రంగంలోకి వెళ్లేందుకు ప్రోత్సహించారు. అయితే, సారా విషయంలో సచిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అభిమానులు ఆసక్తి కనబరిచారు. దానికి తోడు, సారా తన ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. సారా అభిమానులు కూడా ఆమె కెరీర్ పై కాస్త ఆసక్తి చూపించారు. వీటన్నింటికీ.. ఒకే ఒక్క వీడియోతో సారా సమాధానం చెప్పింది.
అయితే, మోడల్ గా పాపులర్ అయిన తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని సారా సన్నిహితులు చెబుతున్నారు.
Advertisements