గాడ్ ఆఫ్ క్రికెట్ టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ పెద్ద కుమార్తె సారా టెండూల్కర్ కూడా దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది.సారా ఎప్పుడూ కూడా ఏదో రకంగా ట్రెండింగ్ లో ఉంటుంది.తన తండ్రి సచిన్ టెండూల్కర్ లాగానే సారాకి కూడా వీరాభిమానులు వున్నారు. బహుశా క్రికెటర్ల పిల్లలలో సారాకి ఉన్నంత క్రేజ్ ఎవ్వరికి లేదేమో. ఇక సారా సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను సంపాదించింది.ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లో సారా పోస్టుల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. సారాకి సంబంధించిన వీడియో కాని లేదా ఫోటోను కాని పోస్ట్ చేసిన ప్రతిసారీ ఆమె అభిమానులు విస్తుపోతారు.
ఎప్పటిలాగే, సారా తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌ను బద్దలు కొట్టి బాగా వైరల్‌గా మారింది. తన తాజా పోస్ట్‌లో, సారా తను ఒకరితో చేతులు పట్టుకుని డేట్ నైట్ అని ఉన్న ఓ ఫోటోను అప్‌లోడ్ చేసింది.డేట్ నైట్ అని పెట్టగానే సారా ఎవరితోనో డేటింగ్ చేస్తుందా అని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.అయితే ఆ ఫొటోలో వున్న వ్యక్తి అబ్బాయి కాదు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్..వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో సరదాగా సారా ఇలా క్యాప్షన్ పెట్టి ఇంస్టాగ్రామ్ స్టోరీలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.