సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. మరణించే సమయానికి శరత్ బాబుకు వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయితే ఆయనకు సంతానం లేదు. దీంతో ఆయన ఆస్తి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా శరత్ బాబు వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. నటి రమాప్రభను ఆయన పెళ్లాడారు. అయితే వాళ్లిద్దరికీ సంతానం లేదు. పెళ్లయిన కొన్నేళ్లకు ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారు. ఈసారి కూడా ఆయనకు సంతానం కలగలేదు. పైగా రెండోసారి కూడా ఆయన వైవాహిక బంధం నిలబడలేదు.
దీంతో ఆయన పూర్తిగా పెళ్లికి దూరమయ్యారు. తన కుటుంబ సభ్యులతోనే కలిసున్నారు, శరత్ బాబుది చాలా పెద్ద కుటుంబం. ఆయన ఉమ్మడి కుటుంబంలో 8 మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కాచెళ్లెళ్లు ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు అయి, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో కూడా కొందరికి పెళ్లిళ్లయ్యాయి. అలా ఈ ఉమ్మడి కుటుంబంలో మొత్తం 23 మంది ఉన్నారు.
వీళ్లే శరత్ బాబు వారసులు. తన ఆస్తి మొత్తాన్ని వీళ్ల పేరట శరత్ బాబు వీలునామా రాసి పెట్టి ఉండొచ్చు. అయితే ఆ విషయం తమకు తెలియదంటున్నాడు శరత్ బాబు తమ్ముడు మధు. దశదిన కర్మ పూర్తయిన తర్వాత, అప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.