టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇటీవల మొదలుపెట్టారు మేకర్స్.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 162 నిమిషాల 25 సెకెన్లు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఈ సినిమాలో మహేష్ చాలా యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్స్ మాస్ సహా అన్ని వర్గాలను ఆకట్టుకుకునేలా పవర్ ఫుల్‌గా ఉండేలా డైరెక్టర్ పరశురామ్ జాగ్రత్తలు తీసుకున్నారు. సముద్ర ఖని విలన్‌గా నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి.
సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన ఓ భారీ కుంభకోణం చుట్టూ కేంద్రీకృతమైందని తెలుస్తోంది. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడిన ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.
All set to embrace your immense love and support from May 12th 💝💫
Get ready to witness Super ⭐@urstrulyMahesh's MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️🔥
Bookings opening in a phased manner across the board 🤗#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQ
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022