కార్తి హీరోగా నటించిన సినిమా సర్దార్. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అదేంటి.. ఈ సినిమా ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చింది, హిట్ కూడా అయింది. ఇప్పుడు కొత్తగా ఫ్లాప్ ఏంటని ఆలోచిస్తున్నారా.. బుల్లితెరపై ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.
సర్దార్ సినిమాను జీ టీవీలో ప్రసారం చేస్తే కేవలం 1.48 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఓ కొత్త సినిమాను తొలిసారి టీవీలో ప్రసారం చేసినప్పుడు ఇంత తక్కువ టీఆర్పీ ఎప్పుడూ రాదు. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను కూడా, తొలిసారి టీవీల్లో ప్రసారం చేసినప్పుడు మినిమం 3 టీఆర్పీ వస్తుంది. కానీ సర్దార్ మాత్రం 2 అంకెను కూడా టచ్ చేయలేకపోయింది.
అయితే దీనికి ఓ కారణం ఉంది. సర్దార్ సినిమాను జీ తెలుగు మెయిన్ ఛానెల్ లో ప్రసారం చేయలేదు. ప్రయోగాత్మకంగా జీ సినిమాలు అనే మూవీస్ ఛానెల్ లో ప్రసారం చేశారు. రేటింగ్ ఇంత తక్కువగా రావడానికి ఇదే కారణం అని తెలుస్తోంది. మొత్తమ్మీద జీ చేసిన ప్రయోగం అలా బెడిసికొట్టింది.