కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సర్దార్. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న సర్దార్ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.స్పై థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది.
సర్దార్‌ను పట్టుకోవడం అంత సులభం కాదు..అనే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ఇన్ స్పెక్టర్ విజయ్ ప్రకాశ్‌గా స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా..ప్రాబ్లమ్ ఉందంటే రాడు సార్..ప్రెస్ ఉందంటే ఖచ్చితంగా వస్తాడు సార్ అంటూ కార్తీ పాత్ర గురించి చెప్తున్న డైలాగ్స్ ఇంట్రెస్టింగ్ సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ ట్రైలర్‌తో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. 2.21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దేశ భద్రతకు సంబంధించి దొంగలించబడిన కీలక పత్రాలను కార్తీ ఎలా సాధించాడన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
కార్తీ ఇందులో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.సర్దార్ చిత్రంలో రాశీఖన్నా, రజిష విజయన్, లైలా ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సర్దార్ తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున రిలీజ్ చేస్తున్నారు.